ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇంటివద్ద తొక్కిసలాట జరిగింది అనంతపురం కు చెందిన శాంతమ్మ అనే మహిళకు ఈ తొక్కిసలాట లో స్ప్రుహ కోల్పోయింది జగన్ మోహన్ రెడ్డి ప్రజాసమస్యలపై నేరుగా ప్రజలతో చర్చించి వారి వద్దనుండి వినతులు స్వీకరించి సమస్యల పై సత్వరం చర్యలు తీసుకోవాలనే ఉదేశ్యం తో జులై 1 నుంచి ప్రజాదర్బార్ నిర్వహించాలని ముందుగా అనుకున్నారు ఐతే ఈ కార్యక్రమం ఆగస్టు 8 వ తారీకు కు వాయిదా పడింది.

ఈ విషయం తెలియని ప్రజలు ముఖ్యమంత్రి నివాసం వద్దకు భారీగా చేరుకున్నారు ఈ క్రమంలో తోపులాట జరిగింది .ప్రజాదర్బార్ ఏర్పాట్లు ఇంకా పూర్తి కాకపోవడం ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు ఉండటం వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడింది సీఎం ని కలిసి తమ బాధలను తెలియజేయాలని దూరప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుదిరిగారు కనీసం సీఎం ఇంటి వద్దకు వచ్చిన ప్రజలను కలవకపోవడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు