లోక్ సభ సమావేశాల్లో పాల్గొన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం మేము ఎంతగానో పోరాటం చేశాం కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ వారు ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పడం వల్లే వారు అధికారం లోకి వచ్చారు వారు హోదా పై పోరాటాలు చేసి దానిని సాదించితీరాలి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే బాధ్యత ఇక వైసీపీ పార్టీ వారిదే అన్నారు.

ఇంకా ఈయన మాట్లాడుతూ 2014 లో బీజేపీ వారు ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తామని మాట ఇచ్చారు ఆ మాట తప్పడం వల్లనే బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గళ్లతయ్యింది, అంతే కాకుండా పార్టీ మారిన ఎంపీ లను ఉద్దేశించి మాట్లాడుతూ ఇతర పార్టీల వారిని బీజేపీలోకి చేర్చుకోవడమే సబ్ కా వికాస్ కు అర్థమా ? అంటూ చురకలు వేశారు ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ ని మించిన పరిస్తుతులు కనిపిస్తున్నాయి అని బీజేపీ పై విమర్శలు సంధించారు