అమెజాన్ న్యూస్ హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ మరో పది రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయంతో జూన్ 10 వరకు రాష్ట్రంలో అమలు కానుంది అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఉన్న సడలింపును మధ్యాహ్నం ఒంటిగంట వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నది. కాగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్డౌన్ అమలులో ఉన్నది. ఇంకా కరోనా నేపద్యంలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గినప్పటికీ… ఇప్పటికిప్పుడు కేసులు పెరిగే ప్రమాదం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.