Saturday, August 13, 2022
Google search engine
Homeరివ్యూఇది జగత్ జజ్జరిక విజయం - బింబిసార

ఇది జగత్ జజ్జరిక విజయం – బింబిసార

ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ” బింబిసార” విడుదల అయింది , ఈ చిత్రం తో కళ్యాణ్ రామ్ స్టార్ హీరో గా మారిపోవడం ఖాయం చాలా చోట్ల ఈ సినిమాని బెనిఫిట్ షో గా ఉదయం 7 గంటలకు తొలి ఆటను ప్రదర్శించారు ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది ఈ సినిమా టైం ట్రావెల్ సోషియో ఫాంటసీ గా ” ఒక క్రూరమైన రాజు గతం నుంచి వర్తమానానికి పయనించి ఏమి చేశాడు ఎలా మారాడు” అనే కాన్సెప్ట్ తో తీయబడింది

ఇక సినిమా విషయానికి వస్తే ఇప్పటివరకు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఈ చిత్రం ఒక అద్బుతం అని సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని ఇందులో కళ్యాణ్ రామ్ నటన ఇప్పటివరకు అతని అన్ని చిత్రాలంటే భిన్నంగా ఉంది ఇందులో అతని హావాభావాలు ,డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కటి మునుపటి కంటే చాలా బాగున్నాయని అంటున్నారు

విజువల్స్ పరంగా , కథ పరంగా ఈ సినిమా కళ్యాణ్ రామ్ ను మరో మెట్టు ఎక్కించాయనడం లో సందేహం లేదు ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమా లోని సంగీతం కానీ ప్రతి ఒక్కటి ఈ సినిమా కి అదనపు బలం చేకూర్చాయి , ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటుడు తమ తమ పాత్ర ల మేరకు అలరించారు

తారాగణం : నందమూరి కళ్యాణ్ రామ్ , కేథరిన్ థ్రెసా – సంయుక్త మీనన్ , వారీనా హుస్సేన్ ,వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ ,శ్రీనివాస రెడ్డి , వైవా హర్ష ,తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

రేటింగ్ : 4/5

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments