నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ ఆయన సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన సోషియో ఫాంటసీ సినిమా బింబిసార , ఈ నెల 5 వాతారీకున ప్రపంచ వ్యాప్తంగా సుమారు 13000 థియేటర్ లలో ఈ చిత్రం విడుదల కానుంది
ఈ చిత్రం లో నందమూరి కళ్యాణ్ రామ్ త్రిగర్తల సామ్రాజ్యాధినేత “బింబిసారుడి గా ఓక క్రూరమైన రాజు గతం నుంచి వర్తమానానికి వచ్చి ఏమి చేసాడు , ఎలా మారాడు అనేది ” అనేది మనం చూడబోతున్నాం
ఇప్పటికే రిలీజ్ అయినా సినిమా ట్రైలర్ , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఈ చిత్ర బృందం చేస్తున్న ప్రొమోషన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి . కల్యాణరామ్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యధిక బడ్జెట్ చిత్రం గా ఈ చిత్రం నిలవనుంది ఈ సినిమా కు దాదాపు 70 కోట్లు ఖర్చు అయిందని సినీ వర్గాల్లో వినికిడి
ఇకపోతే ఇప్పటివరకు టైం ట్రావెల్ చిత్రాలు ఎన్నో వచ్చాయి కాకపోతే అవన్నీ వర్తమానం నుంచి గతానికి లేదా భవిష్యత్ కి వెళ్ళేదే కనే ఇందులో మాత్రం హీరో గత నుంచి వర్తమానానికి టైం ట్రావెల్ చేసి వస్తాడట , ఈ చిత్రం అత్యంత సాంకేతిక పరిజ్ఞానం తో నిర్మించినట్లు చిత్ర బృందం వెల్లడించింది
తారాగణం : నందమూరి కళ్యాణ్ రామ్ , కేథరిన్ థ్రెసా – సంయుక్త మీనన్ , వారీనా హుస్సేన్ ,వెన్నెల కిషోర్ , బ్రహ్మాజీ ,శ్రీనివాస రెడ్డి , వైవా హర్ష ,తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
నిర్మాత : కొసరాజు హరికృష్ణ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్
దర్శకుడు :వశిష్ట మల్లిడి
సంగీతం : ఎం ఎం కీరవాణి , చిత్రంతన్ భట్
సినిమాటోగ్రఫీ : చోట కే నాయుడు
ఎడిటింగ్ : తమ్మరాజు
ఆర్ట్ డైరెక్టర్ : కిరణ్ కుమార్ మన్నే
పాటలు : రామజోగయ్య శాస్త్రి