తాజా వార్తలు - Amazon News

ఇక వరంగల్ సెంట్రల్ జైల్ లేదు

విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తన మార్క్ చూపిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కీలక అడుగు వేసారు. వరంగల్ సెంట్రల్ జైలు తరలింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దాని స్థానంలో ఎంజీఎం తరలించి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే వరంగల్ సెంట్రల్ జైలు, ఎంజీఎం పరిశీలించేందుకు వచ్చిన సీఎం కేసీఆర్ అధికారులకు సూచనలు చేసారు. వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలు, సిబ్బందిని ఇతర జైళ్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం […]

read more

కరోనా కి ఆయుర్వేదం చిట్కాలు

కృష్ణపట్నం ఆనందయ్య గారి కరోనా వైరస్ కి ఇచ్చే మందు తయారీ విధానాన్ని పూర్తిగా, ప్రతి ఇంట్లో ప్రతి ఊరిలో అందరూ తయారు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాముఆయుష్ డిపార్ట్మెంట్ వారు కూడా ఔషధం లో ఎలాంటి దుష్ప్రభావాలు లేవు. కాబట్టి ఈ మందు అందరూ వాడవచ్చు. ఈ ఔషధం తయారీ విధానాన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చిన మోతాదులో మనం తయారుచేయడం జరిగినది.కాబట్టి ఈ ఔషధం ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊరిలోఅన్నిచోట్ల దొరికే వనమూలికలు ఇవి మూలికా దినుసులు […]

read more

ఒకే అడ్రస్‌పై 37 పాస్‌పోర్టులు: సజ్జనార్‌

బోధన్‌ పాస్‌పోర్టు కేసు వివరాలు వెల్లడించిన సీపీ హైదరాబాద్(amazonnews) బోధన్‌ పాస్‌పోర్టు కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై మల్లేష్‌రావు, ఏఎస్సై అనిల్‌కుమార్‌ కూడా ఉన్నట్లు సీపీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సజ్జనార్‌ మీడియాకు వివరించారు. ‘‘బోధన్‌లో 7 చిరునామాలతో 72 పాస్‌పోర్టులు పొందారు. వాటిలో ఒకే చిరునామాతో […]

read more

మొక్కల పెంపకాన్ని బాధ్యతగా తీసుకోవాలి ఎంపీడీఓ శ్రీనివాసులు

పినపాక,భద్రాద్రి కొత్తగూడెం(amazonnews) మండల వ్యాప్తంగా హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాల కింద ఏర్పాటు చేస్తున్న నర్సరీల్లో మొక్కల పెంపకా న్ని సెక్రటరీ, సర్పంచ్ లు, స్థానిక ప్రజాప్రతినిధులు బాధ్యతగా తీసుకోవాలని ఎంపీడీఓ శ్రీనివాసులు అన్నారు. శనివారం మండలంలోని తోగూడెం గ్రామంలో గల నర్సరీ, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఏపీఓలు నర్సరీల ను మండల స్థాయిలో పర్యవేక్షిస్తూ వందశా తం మొక్కలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పనుల్లో జాప్యం […]

read more

కరోనా కొత్త రకం వైరస్ : తెలంగాణ సర్కార్ అప్రమత్తం..

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్ లో కొత్త రకం కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. వైరస్ పై ఉండే కొమ్ము భాగాల్లో మార్పులు చోటు చేసుకొని శరీరంలోకి ఈజీగా ప్రవేశిస్తున్నాయి. కరోనా వైరస్ కంటే రూపాంతరం చెందిన కొత్త వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. 70శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ తరహా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచాన్ని అలర్ట్ చేశారు. ప్రపంచ ఆరోగ్యసంస్థకు […]

read more

గ్యాస్ (Gas) వినియోగ దారులకు గుడ్ న్యూస్

🔹 ఇక సెకన్లలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కూడా చేయక్కర్లేదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికి ఫోన్ కాల్ చేస్తున్నారా ? అయితే మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఫోన్ చేయాల్సిన పని లేకుండానే సులభంగానే సెకన్లలోనే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. 🔹 గ్యాస్ (Gas) సిలిండర్ వినియోగ దారులకు శుభవార్త. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు కస్టమర్లకు వాట్సాప్ ద్వారానే సిలిండర్ బుకింగ్ ఫెసిలిటీని అందిస్తున్నాయి. భారత్ గ్యాస్ సిలిండర్, ఇండేన్ […]

read more

అంబేద్కర్ భవనం నిర్మించాలని ఎమ్మెల్యే రేగాను కలిసిన దుగినేపల్లి అంబేద్కర్ యూత్ సభ్యులు.

పినపాక మండలం లోని దుగినేపల్లి లో డబుల్ బెడ్ రూమ్ శంకుస్థాపన కు విచ్చేసిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంతారావును దుగినేపల్లి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కలిసి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా:బాబాసాహెబ్ అంబేద్కర్ భవనానికి దుగినేపల్లి లో గల ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 100/1 లో అంబేద్కర్ భవనఏర్పాటుకు స్థలం కేటాయించాలని, తద్వారా ఆ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మించాలని దుగినేపల్లి యూత్ అందరూ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసి […]

read more