మహబూబ్ నగర్ తండాకు చెందిన అనిల్, సరోజలు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెద్దలను ఎదిరించి మరీ పెళ్లిచేసుకున్నారు కలిసి బ్రతుకుదాం అని హైదరాబాద్ వచ్చి రెహమత్నగర్ సుభాష్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని చిన్న చిన్న పనులు కలిసి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు ఇంకేం అంతా సంతోషమే … కానీ అది కేవలం కొంతకాలం మాత్రమే
భార్యపై అనుమానమో లేక వరకట్న వేదింపో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ పెళ్ళైన కొంతకాలానికే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి అది పెద్దల మధ్య పంచాయతీ వరకు వెళ్ళింది పెద్దలేదో సర్దిచెప్పారు కొంతకాలం బాగానే ఉన్నారు

అయితే కూతురితో మాట్లాడాలని ఆ తండ్రి తన కూతురికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు గత శనివారం నుంచి కూతురు ఫోన్ లిఫ్ట్ చేయలేదు మరో వైపు అల్లుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఏమైందో చూద్దాం అని సరోజ తండ్రి రెహమత్నగర్ సుభాష్ నగర్లో కూతురి ఇంటికి వచ్చాడు తీరా చుస్తే ఇంటికి తాళం వేసి ఉంది
ఈసారి అతనికి అనుమానం కాస్త ఎక్కువ అయింది మరోసారి అనిల్‌కు కాల్ చేశాడు. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన అనిల్.. పొంతన లేని సమాధానాలు ఇచ్చాడు. అనుమానంతో తాళం పగలగొట్టిన సరోజ తండ్రి.. లోపల దృశ్యాలు చూసి గుండె పగిలేలా రోదించాడు. చిన్న వాటర్ డ్రమ్‌లో సరోజ మృతదేహాం రెండు ముక్కలై పడి ఉంది.
సరోజను డంబెల్‌తో కొట్టి చంపి.. ఆపై రెండు ముక్కలుగా చీల్చేసి వాటర్ డ్రమ్‌లో కుక్కేశాడు అనిల్!. సరోజ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అనిల్ జాడ కోసం గాలింపు చేపట్టారు. సరోజ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.