స్వతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో అల్లర్లు, అలజడులు, పేలుడులు జరిగే అవకాశం ఉందా ?? అవుననే అంటున్నాయి ఇంటిలిజెన్స్ వర్గాలు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 15న జరగబోయే స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అలజడులు రేగే అవకాశం ఉందని మరియు తీవ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ బ్యూరో వెల్లడించింది ,ఇంటిలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందించాయి అయితే ఈ సమాచారాన్ని అందుకున్న ప్రభుత్వ వర్గాలు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రతి చోట పోలీసు బలగాలను భారీగా మోహరించాలని అదేవిధంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది
జనసంచారం ఎక్కువగా ఉండే బస్టాండు, రైల్వే స్టేషన్, సినిమా థియేటర్లు, గుడులు, మసీదులు, చర్చిలు, స్కూలు, ప్రభుత్వ ఆఫీసులు ఇలా ప్రతి చోట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాయత్తమవుతుంది అదే విధంగా కొన్నిచోట్ల ఇప్పటికే పలు తనిఖీలను మొదలు పెట్టారు