Saturday, August 13, 2022
Google search engine
Homeఆంధ్రప్రదేశ్భూ వివాదాలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

భూ వివాదాలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం (సమగ్ర సర్వే)పై తాడేపల్లి కార్యాలయం లో అధికారులతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగనమోహన్ రెడ్డి గారు సమీక్షను నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమగ్ర సర్వే వలన అన్ని రకాల భూ సమస్యలు పరిస్కారం అవుతాయని తెలిపారు , ముఖ్యం గా ఈ సమగ్ర భూ హక్కు , భూ రక్ష పథకం ద్వారా ఇప్పటివరకు జరిగిన జరిగిన సర్వే వివరాలను అధికారులు ఆయనకు అందించారు

ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ సర్వే ను అనుకున్న సమయంలోగా కచ్చితంగా పూర్తిచేయాలని అనుదుకు అవసరమైన సిబ్బంది , మరియు ఇతరేతర సాంకేతిక పరికరాలను అవసరాలకు అనుగుణంగా సమార్చుకోవాలని సూచించారు అందుకు అవసరమైన అన్ని రకాల డ్రోన్ లు , రాళ్లు , రోవర్లు ఎక్కడెక్కడ ఎంత వరకు అవసరమో వాటి యొక్క వివరాలను తెలుసుకుని వాటిని ఆయా ప్రాంతాలకు సమకూర్చి త్వరితగతిన ఈ సర్వే ను ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని అందుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీచేయడమైనది

ఈ కార్యక్రమం లో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాలనాయడు, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయి ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments