లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు. తొలి రోజే రూ.45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ తాజాగా రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. వీకెండ్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ విక్రమ్ దుమ్ము దులుపుతున్నట్లు తెలుస్తోంది
ఈ వీకెండ్ (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో ఉంది. 167 మిలియన్ డాలర్లతో టాప్ గన్ మావెరిక్ మొదటి స్థానంలో, 55 మిలియన్ డార్లతో జురాసిక్ వరల్డ్ డొమీనియన్రెండో స్థానంలో నిలవగా 21 మిలియన్ డాలర్లతో విక్రమ్ మూడో స్థానంతో పాగా వేసింది. కాగా జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విక్రమ్‌లో కమల్ యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టాడు.