రాళ్లు ఎంత బరువుంటాయి?? అదేం ప్రశ్న వందల కిలోలు కూడా ఉంటాయి అంటారా?? ఆగండి ఆగండి నేను అడిగేది కిడ్నీ లో ఉండే రాళ్ల గురించి మహా అయితే ఒక 100 లేదా 200 గ్రాములు వరకు ఉంటాయి అదికూడా బాగా సీరియస్ ప్రాబ్లెమ్ అయితేనే , కానీ ఇప్పుడు మనం చెప్పేది సీరియస్ ప్రాబ్లెమ్ కాదు దాని అమ్మ మొగుడు ఏకంగా ఒక కిలో బరువు ఉన్న రాయి ని కొన్ని నెలలుగా కిడ్నీ లో పెట్టుకుని తిరుగుతున్నాడు
వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లా పటోలి నివాసి అయిన 50 ఏళ్ల రామన్ చౌరే గత కొన్ని రోజులుగా కిడ్నీ సమస్య తో బాధపడుతున్నాడు స్థానికంగా ఉన్నటువంటి ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు ఇక చేసేది లేక ముంబై లోని పెద్దాసుపత్రి వెళ్ళాడు డాక్టర్ లు అతని పరీక్షించిన తర్వాత అతని కిడ్నీ లో ఏదో భారీ పరిమాణం లో ఉన్న ఆకారాన్ని చూసి మొదట ఏదో కణితి లా భావించి దాన్ని సర్జరీ ద్వారా తొలగించాలని అనుకున్నారు కానీ సర్జరీ లో ఆతని కిడ్నీ లో ఉన్నది కణితి కాదు అది రాయి అని తెలుసుకుని కంగుతిన్నారు
ఈ విషయం పై వైద్యులు మాట్లాడుతూ బహుశా ప్రపంచంలోనే ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటి సారి అయి ఉండవచ్చు కచ్చితంగా గా ఈ సంఘటనను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లేదా గిన్నిస్ రికార్డ్ లో చోటు లభించినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని అన్నారు
సర్జరీ తర్వాత రామన్ చౌరె ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే ఆయన ఎప్పటిలాగా తన వ్యవసాయ పనులు చేసుకోవచ్చని కూడా తెలిపారు
O my god
This is amazing 👍