నితిన్ మాస్ హీరోగా నిరూపించుకోవాలని ఎప్పటి నుంచో తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు కాకపోతే ఆ ప్రయత్నాలు సఫలం అయ్యేలా మాత్రం లేవు
ఈ రోజు విడుదల అయిన మాచెర్ల నియోజక వర్గం సినిమా కూడా అతని ఆశలపై నీళ్లు బకెట్లు బకెట్లు గా చల్లింది 90 వ దశకం లో వచ్చింటువంటి దాదాపు అన్ని చిత్రాల ను ఈ చిత్రం పోలి ఉంది .
ఒక ప్రాంతంలో ఉన్న బలమైన విలన్ని అడ్డుకోవడానికి హీరో అక్కడికి రావడం అతనితో పోటీ పడి విలన్ని చితక్కొట్టి ఓడించడం అక్కడి జనాలకు విలన్ పీడ విరగడ చేయడం ఇదే మూస కథ 90 వ దశకం లో నడిచింది
ఇప్పుడు కూడా అదే కథతో ఈ సినిమా తీయడం అనేది పెద్ద సాహసమనే చెప్పాలి పోనీ ఇందులో ఏదైనా కొత్తగా ఏదైనా చెప్పారా అంటే అది లేదు ఇప్పటికే వచ్చిన కొన్ని సినిమాల్లోని ఒక్కో సన్నివేశాన్ని కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేశారు అంతే
సినిమా కథ గురించి చెప్పుకుంటే 30 సంవత్సరాలుగా ఎన్నికలే లేకుండా గెలుస్తూ వచ్చిన ఒక దుష్ట నాయకుణ్ణి ఎదురించి కలెక్టర్ అయిన హీరో ఆ ప్రాంతంలో ఎన్నికలు ఎలా జరిపించాడు అన్నదే కథ , చిరాకు పుట్టించే పాటలు , రోత హాస్యం , ఉపయోగం లేని హీరోయిన్లు , మూస విలనిజం ఇదే సినిమా అంతా
కొంతలో కొంత విలన్ గా నటించిన సముద్రఖని ద్విపాత్రాభినయం చేయడం , ఆ కొంతలో అతని నటన పర్వాలేదు ఇక హీరోగారి నటన లో పెద్దగా మార్పు లేదుకానీ యాక్షన్ సన్నివేశాలు ఓ మోస్తరుగా ఉన్నాయి
హీరోయిన్లు ఉన్నారు కానీ వారికి పెద్దగా నటించే అవకాశం మాత్రం లభించలేదు మొదటిసారిగా మెగాఫోన్ పట్టుకున్న MS sekhar పూర్తిగా విఫలం అయ్యాడు ఇతన్ని నమ్మి నితిన్ ఈ సినిమా ఎలా ఒప్పుకున్నాడు అనేది అతనికే తెలియాలి
ఒక్క మాటలో చెప్పాలంటే
” పాత సారా కొత్త సీసా పసలేని కథనం రుచిలేని కథ “పర్లేదు మాకు పాత సినిమాలే నచ్చుతాయి, మాకు బోరింగ్ సినిమాలు అంటే ఇష్టం అనుకుంటే భేషుగ్గా సినిమా చూడొచ్చు రేటింగ్ : 2/5