Thursday, December 1, 2022
Google search engine
Homeతాజా వార్తలు10 రూపాయలకే నెట్ ఫ్లిక్స్.. * షరతులు వర్తిస్తాయి

10 రూపాయలకే నెట్ ఫ్లిక్స్.. * షరతులు వర్తిస్తాయి

ఇండియా లోనే ఖరీదైన ఓటిటి ప్లాట్ఫారం లో ఒకటి నెట్ ఫ్లిక్స్ దీని వార్షిక సబ్స్క్రిప్షన్ 2388 రూపాయలు గా ఉంది ఇకపోతే నెట్ ఫ్లిక్స్ త్వరలో భారతదేశం లో కేవలం 10 రూపాయలకే సబ్స్క్రిప్షన్ ను తమ వినియోగదారులకు అందివ్వనుంది అయితే ఇక్కడ షరతులు మాత్రం షరా మామూలే

ఇక విషయానికి వస్తే ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ” పే నియర్ బై” సాచెట్ సబ్స్క్రిప్షన్ పేరుతో ప్రతి వినియోగదారులకు 10 రూపాయలకే నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ను అందివ్వనుంది కానీ అది కేవలం ” రూరల్ ఏరియా లోని వినియోగదారులకు మాత్రమే”

ఈ విషయం పై ఫిన్ టెక్ సంస్థ ” పే నియర్ బై ” సీఈఓ ఆనంద్ కుమార్ బజాజ్ మాట్లాడుతూ పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వినోదానికి కాస్త దూరంగా ఉన్నారని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఇంటర్నెట్ ను కేవలం చాటింగ్ , సోషల్ మీడియా ల లో మాత్రమే ఉపయోగిస్తున్నారు అంతే కాకుండా అధిక ధరలను చెల్లించి వారు ఖరీదైన సబ్స్క్రిప్షన్ లను పొండలేరని అలాంటి వారికోసమే ప్రత్యేకంగా తాము త్వరలో “భారత్ ” అనే పేరుతో క్యాంపెయిన్ ను మొదలు పెట్టబోతునట్టు తెలిపారు

ఈ క్యాంపెయిన్ లో సబ్స్క్రిప్షన్ ధర కేవలం 10 రూపాయలు అయితే ఈ ఆఫర్ కేవలం రూరల్ ఏరియా లోని వినియోగదారులకు మాత్రమే లభిస్తుంది ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వినియోగదారులు ఒక ఏదైనా ఒక సినిమా లేదా సిరీస్ ను వీక్షించవచ్చు అని తెలిపారు

ఇందుకోసం ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ సంస్థ తో సంప్రదింపులు జరిగాయని వారు కూడా దీనికి సుముఖత వ్యక్తం చేశారని త్వరలోనే ఈ ఆఫర్ ను రూరల్ ఏరియా లోని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments