Thursday, December 1, 2022
Google search engine
Homeతాజా వార్తలుజనాల మాట … నొప్పులు అక్కడ.. ప్రసవం ఇక్కడ !! గెలిచిన వారిదే రాజకీయం

జనాల మాట … నొప్పులు అక్కడ.. ప్రసవం ఇక్కడ !! గెలిచిన వారిదే రాజకీయం

అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం విన్నాం , సొమ్మొకడిది సోకు మరొకడిది అనేది కూడా విన్నాం ఇది కూడా ఆ కోవకు చెందిందే కాకపోతే వింత ఏంటంటే మేము చేశాం అంటే మేము చేశాం అని ఒకే పార్టీలోని వారు వాదులాడుకోవడమే, రాజకీయం అంటే నే గెలిచినవాడు చెప్పిన దే చెల్లుబాటు కావటం కదా ! ఇది అనాదిగా వస్తున్నదే

అసలు విషయం లోకి వస్తే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని పినపాక , మణుగూరు , కరకగూడెం మండలంలోని వాహనదారులు ఏదైనా వాహన రిజిస్ట్రేషన్ కు సంబందించిన పనుల కోసం భద్రాచలం వెళ్లవలిసిన పరిస్థితి , ఈ మూడు మండలాల ప్రజలు భద్రాచలం వెళ్లాలంటే దాదాపు 70-100 కిలోమీటర్లు ప్రయాణించాలి ఆర్టీఓ ఆఫీస్ లో పని అయిందా సరే లేకుంటే మరోరోజు వెళ్లి తీరాల్సిందే , ఈ సమస్య తీరాలి అంటే దగ్గరలోని ఒక ప్రాంతంలో ఆర్టీఓ ఆఫీస్ ఉండాలని 2018 లో నాటి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వానికి మా ప్రాంత ప్రజలు వాహన రిజిస్ట్రేషన్ కు సంబందించిన పనుల నిమిత్తం సుమారు 100 కిమీ ప్రయాణించి వెల్ల వలిసివస్తుంది అని , అందరికి దగ్గరలో ఉన్నటువంటి మణుగూరు ప్రాంతం లో ఆర్టీఓ ఆఫీస్ ను ఏర్పాటు చేయాలనీ అలా కానీ పక్షంలో కనీసం వారానికి కనీసం 2-3 రోజులు మణుగూరు ప్రాంతంలో ఆర్టీఓ అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఒక అర్జీ వేయడం జరిగింది

ఇంత వరకు బాగానే ఉంది మళ్ళి ఎన్నికలు వచ్చాయి పాయం వెంకటేశ్వర్లు తన ప్రత్యర్థి రేగా కాంతారావు మీద ఓడిపోవడం ఆ తర్వాత రేగా కాంగ్రెస్ నుంచి తెరాస లోకి రావడం అన్ని చక చకా జరిగిపోయాయి అంతా బాగానే ఉన్నా ఆర్టీఓ ఆఫీస్ ను మణుగూరు లో ఏర్పాటు చేయడం అన్న విషయం లో ఒక చిక్కు వచ్చింది అదేంటి అంటారా ??

2018 లో నాటి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఏవిధంగా ఐతే ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారో అదే విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి రేగా కాంతారావు కూడా ఇదే విషయం పై గత నెల అనగా జూన్ – 21-2022 న ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా ఒప్పుకుని మణుగూరు లో ఆర్టీఓ ఆఫీస్ ను పెట్టడం లేదా వారానికి 2-3 రోజులు ఆర్టీఓ సిబ్బంది ని అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని అందుకు సంబందించిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు

అరె అంత బానే ఉంది కదా ఇందులో సమస్య ఏంటి అనుకుంటున్నారా ? ఇక్కడే ఉంది సమస్య అంతా ఎంత ఒకే పార్టీలో ఉన్నవారైనా సరే ఎవరి వర్గం వారు వారి కి మద్దతు గా ఉండటం పరిపాటే కదా అలానే మణుగూరు కి ఆర్టీఓ ఆఫీస్ వచ్చింది / వస్తుంది అంటే దానికి పాయం వెంకటేశ్వరులే అని కొందరు కాదు రేగా కాంతారావు వల్లనే వచ్చింది /వస్తుంది అని కొందరు బహిరంగంగానే వాదులాట లాంటి చర్చలు జరుపుతున్నారు

ఇంకొందరైతే మరో అడుగు ముందుకు వేసి పాయం వెంకటేశ్వర్లు పెట్టుకున్న అర్జీని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మణుగూరు కి ఆర్టీఓ ఆఫీస్ ను మంజూరు చేయబోతుందని ఒక నెల ముందుగా తెలుసుకున్న రేగా కాంతారావు ఎలాగైనా సరే పాయానికి మంచిపేరు రాకుండా ఉండాలని తానే అప్పటికప్పుడు కొత్తగా అర్జీ పెట్టుకుని , ఆ ఆర్టీఓ ఆఫీస్ మణుగూరు కి రావడానికి కృషి చేసానని చెప్పుకుని ఆ క్రెడిట్ కూడా తన ఖాతాలోకి వేసుకున్నాడని అనుకుంటున్నారు

ఏదైతే ఏంటి ఎవరు తెస్తే ఏంటి ఎప్పటినుంచో ఉన్న సమస్య ఇప్పుడు తీరింది కదా అని ఒక్కరుకూడా అనుకోకపోవడం విచిత్రంగా ఉంది !!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments