నగదు చెల్లింపు లో గూగుల్ పే , ఫోన్ పే , పేటీఎం లు మన దేశంలో ఒక విప్లవాన్ని తెచ్చాయని చెప్పాలి . నోట్లరద్ద కు ముందు ఈ UPI ఆధారిత ఆప్ లకు ఒక మోస్తరుగా ఆదరణ ఉన్నా ఆ తర్వాత సమయం లో ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం వలన ఈ డిజిటల్ పేమెంట్ ఆప్ లకు మరింత ఆదరణ లభించింది పల్లె , పట్టణం అనే తేడా లేకుండా ప్రతి చిన్న వ్యాపారాలు సైతం ఈ విధానాన్ని వాడుతున్నారు . ఇందుకు గాను ఆయా ఆప్ లు ఎటువంటి రుసుమును వసూలు చేయడం లేదు
కానీ ఇక పై అలా కుదరదేమో ఎందుకంటె కేంద్ర ప్రభుత్వం మరియు RBI UPI ద్వారా చేసే చెల్లింపులపై త్వరలో రుసుమును చార్జీల రూపం లో వసూలు చేయాలనీ ఆలోచిస్తున్నట్టు సమాచారం , దీనిపై అక్టోబర్ 3 లోపు ప్రజల నుంచి అభిప్రాయాలు , సూచనలు సేకరించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు సమాచారం.
ఒక వేళ ఇదే గనుక జరిగితే కచ్చితం గా ఇటువంటి లావాదేవీలు జరిపే వారి పై భారం పడ్డట్టే , ఇప్పటికే పేటీఎం , ఫోన్ పే , గూగుల్ పే లు తమ ప్లాట్ఫారం నుంచి చేసే మొబైల్ రీఛార్జి లకు నామ మాత్రపు రుసుము ను వసూలు చేస్తున్నాయి , ఇకపై వీటి వినియోగ దారుడు చేసే ప్రతి చెల్లింపు పై చార్జీ లను చెల్లించాల్సి ఉంటుందో లేక గరిష్ట పరిమితి ధాటిన వారు మాత్రమే చార్జీలను చెల్లించ వలసి ఉంటుందో తెలియాలంటే ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు వచ్చే వరకు వేచి ఉండాల్సిందే