రియల్ మీ సంస్థ ఈ రోజు కొత్త మోడల్ స్మార్ట్ వాచ్ ను మార్కెట్లోకి విడుదల చేసింది , ఈ మోడల్ తొలి అమ్మకం లో భాగంగా ప్రత్యేకమైన ఆఫర్ ను వినియోగ దారులకు అందిస్తుంది
ఇందులో ప్రత్యేకంగా నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ను బిల్ట్ ఇన్ స్మార్ట్ పవర్ ఆంప్లిఫయర్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు దీని వల్ల సౌండ్ క్వాలిటీ అనేది క్లియర్ గా ఉంటుంది మనం కాల్ మాట్లాడేటప్పుడు అవతలి వారికీ కూడా స్పష్టంగా వినిపిస్తుంది
అంతే కాకుండా కాల్ మాట్లాడేటప్పుడు కూడా బ్లుటూత్ కనెక్షన్ అనేది కనెక్టింగ్ లోనే ఉంటుంది దీనికోసం డ్యూయల్ మోడ్ బ్లుటూత్ చిప్ ను ఈ వాచ్ లో అమర్చారు
రియల్ మీ 3 వాచ్ యొక్క స్పెషల్ ఫీచర్స్
- దీని ధర 3499 ఉండగా ఆఫర్ లో కేవలం 2999 రూపాయలకే లభిస్తుంది
- ఈ వాచ్ బ్లాక్ , గ్రే కలర్ లో అందుబాటులో ఉంది
- 1.8 ఇంచుల స్క్వేర్ టచ్ డిస్ప్లే, 240×286 పిక్సెల్స్ రెజల్యూషన్, 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్
- 100కుపైగా వాచ్ ఫేసెస్. స్మార్ట్‌ఫోన్‌లో రియల్మీ లింక్ యాప్‌కు సింక్ చేసుకొని ఫేసెస్ చేంజ్ చేసుకునే సదుపాయం
- మొత్తంగా 110కిపైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్
- నిరంతర హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెన్స్‌ను కొలిచే SpO2 మానిటరింగ్ ,స్లీప్ ట్రాకర్ , స్ట్రెస్ మానిటర్ హెల్త్ ఫీచర్,వాటర్ డ్రింకింగ్ రిమైండర్ కూడా ఉన్నాయి
- 340mAh బ్యాటరీ. ఫుల్ చార్జ్‌పై 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్. పూర్తి చార్జ్ అయ్యేందుకు 2.25 గంటల టైమ్