నీయవ్వ తగ్గేదేలా అని పుష్ప సినిమా లో అల్లు అర్జున్ ఎర్రచందనం పోలిసులకు దొరకకుండా నీటి గుండా రవాణా చేసి తప్పిస్తాడు
అయితే అది సినిమా అక్కడ ఏదైనా చేయొచ్చు ఎలాగైనా చేయొచ్చు
కానీ మేమైనా తక్కువ తిన్నామా అని కొంతమంది “పుష్పలు ” నిజ జీవితంలో అలాంటి ప్రయత్నమే చేసారు కాకపొతే అక్కడ “ఎర్ర చందనం” ఇక్కడ ” టేకు మొద్దులు” కానీ ఏం లాభం వారి ప్రయత్నం నిజంగా నీళ్ల పాలే అయింది
వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తాలూకా ఏడూళ్ల బయ్యారం గ్రామం గోదావరి నదీ పరివాహక ప్రాంతం నది కి అనుకుని అడవి ప్రాంతం కూడా ఉంది
అధికారులు ఎన్ని నిబంధనలు పెట్టినా ఎంత కఠిన తీసుకుంటున్నా వాటిని తప్పించుకుని ఈ అటవీ ప్రాంతం నుంచి విలువైన “టేకు మొద్దులు ” అక్రమంగా రవాణా చేస్తున్నారు . రోడ్డు మార్గమం గుండా వెళితే దొరికిపోతాం అనుకున్నారేమో కొత్త గా ఉంటుందని “ పుష్ప సినిమాలో ” మాదిరిగా నది మీదుగా రవాణా చేద్దాం అనుకున్నారు

అనుకున్నదే తడవుగా ఒక పడవలో 40 మొద్దులను గోదావరీ నదిలో తీసుకువెళ్తున్నారు అయితే అంతా అనుకున్నదే జరిగితే ఇది కూడా మరో పుష్ప సినిమా అయ్యేదే కానీ అంత అదృష్టం లేదు పాపం
ఎలా తెలిసిందో కానీ అధికారులకి ఈ విషయం తెలిసిపోయింది హుటా హుటిన అటవీశాఖ అధికారుల ఆ దొంగలను పట్టుకుందాం అని బయలుదేరారు, కానీ ఏం లాభం ఎంత దొంగలు అయినా వాళ్ళు కూడా మనుషులేగా పైగా ఇప్పుడు అందరి దగ్గరా మొబైల్ ఉండనే ఉంది అధికారులు తమని పట్టుకోవడం కోసం వస్తున్నట్టు తెలుసుకున్న దుంగల దొంగలు అక్రమంగా రవాణా చేస్తున్న టేకు దుంగలను ఆ నది లోనే వదిలేసి తప్పించుకున్నారు

ఈ విషయం పై అటవీ అధికారులు స్పందిస్తూ కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం గోదావరి నది గుండా ” టేకు మొద్దుల” అక్రమ రవాణా జరుగుతుందని తెలుసుకుని వారిని పట్టుకోవడం కోసం వస్తే ఆ దొంగలు తప్పించుకున్నారని అయితే 40 టేకు మొద్దులను స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ సుమారు 5-6 లక్షలు ఉండొచ్చని తెలిపారు , దొరికిన టేకు దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని అటవీ ఉద్యానవన శాఖ వారి సమక్షంలో భద్రపరుస్తామని తెలిపారు , నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని పోలీస్ శాఖ వారి కి పిర్యాదు చేస్తామని తెలిపారు





