Saturday, August 13, 2022
Google search engine
Homeజాతీయందేశ జనాభా 140కోట్లు , టాక్స్ రిటర్న్ చేసింది 5 కోట్ల 82 లక్షలు !!...

దేశ జనాభా 140కోట్లు , టాక్స్ రిటర్న్ చేసింది 5 కోట్ల 82 లక్షలు !! మరి మిగిలిన వాళ్లు??

పప్పు మీద పన్ను , ఉప్పు మీద పన్ను అంతెందుకు పాలమీద , పెరుగు మీద కూడా పన్నే
ఒక మనిషి పొద్దున్న లేచిన దగ్గరనించి రాత్రి పడుకునే వరకు వినియోగించే దాదాపు అన్ని వస్తువుల మీద కూడా పన్ను ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిందే
సొల్లు ఒద్దు పాయింట్ కి రా అంటారా?? అయితే రావాల్సిందే

మనదేశ జనాభా సుమారు 140 కోట్లు మరీ ఇందులో పన్ను అదే టాక్స్ రిటర్న్ ఫైల్ చేసే వాళ్లు ఎంతమంది ?? తెలియదు కదా 2022-2023 ఆర్థిక సంత్సరానికి గాను కేవలం 5 కోట్ల 82 లక్షల 88 వేల 692 మంది మాత్రమే టాక్స్ రిటర్న్ చేశారు అంటే నమ్ముతారా? నమ్మి తీరాలి ఎందుకంటే ఇది నేను చెప్తున్నది కాదు సాక్షాత్తు ఇన్కమ్ టాక్స్ వారి లెక్కల ప్రకారమే!!

అంటే కేవలం 4% జనాభా మాత్రమే తమ ఆదాయ వివరాలను ప్రభుత్వానికి అందిస్తున్నది .అదేంటి 140 కోట్లకి కేవలం 4% ఏ అనుకుంటున్నారా లేక అబ్బో 4% జనాలు టాక్స్ కట్టారు అనుకుంటున్నారా?? సర్లే ఏదో ఒకటి అయితే అనుకుంటున్నారు కదా అది చాలు

ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరూ టాక్స్ రిటర్న్ చేయాలి అంతే కాదు 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పెద్దగా ప్రభుత్వానికి పన్ను కట్టే అవకాశం లేదు అంటే 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఎవరూ ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు కానీ, తమ ఆదాయ వివరాలను మాత్రం టాక్స్ రిటర్న్ ద్వారా తెలియజేయాలి

ఇక్కడ టాక్స్ కట్టడం వేరు టాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం వేరు అనే విషయాన్ని మనం గుర్తించాలి

ఇక విషయానికి వస్తే టాక్స్ కడితే ప్రభుత్వానికి వచ్చే లాభం ఇంకా ఒక వ్యక్తి కి వచ్చే లాభం ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యక్తుల / వ్యవస్థ ల ఆదాయ వివరాలు ,వ్యక్తుల/ వ్యవస్థలకు తాము సంపాదించిన సొమ్ము తప్పుడు మార్గం లో సంపాదించినది కాదు అని తెలియజేయడమే

వర్కర్ పాపులేషన్ రేషియో ప్రకారం చూసుకుంటే మనదేశంలో ప్రభుత్వ ఇంకా ప్రైవేట్ సంస్థల లో మరియు దినసరి కూలి గా పనిచేస్తున్నవారు 43% ఉన్నారు వీరిలో సంవత్సరానికి 5 లక్షల లోపు సంపాదించే వారు 26% ఉన్నారు మిగిలిన 17% ఉద్యోగులు అంతకంటే ఎక్కువ సంపాదన కలిగి ఉన్నారు .

ఇక వ్యాపారుల విషయానికి వస్తే 23% జనాభా ఉన్నారు ఇందులో సంవత్సరానికి 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 12% జనాభా మిగిలిన 11% జనాభా అంతకంటే ఎక్కువే సంపాదిస్తున్నారు

అంటే 43+23= 66% జనాభా మనదేశంలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఇందులో 5 లక్షల లోపు ఆదాయం ఉన్న ఉద్యోగులు , వ్యాపారులు 38% మంది ఉన్నారు మిగిలిన 28% ఉద్యోగులు ఇంకా వ్యాపారస్తులు 5 లక్షల కంటే ఎక్కువే సంపాదిస్తునట్టు లెక్క

మిగిలిన 34% జనాభా కి అసలు ఆదాయ మార్గాలు లేనట్టు ఇందులో పిల్లలు , విద్యార్థులు,ముసలి వాళ్లు, ఇలా రకరకాల వారు ఉంటారు

అది సరే 28% జనాభా టాక్స్ రిటర్న్ చేయాల్సి ఉంటే కేవలం 4% మాత్రమే టాక్స్ రిటర్న్ చేశారు మరీ మిగిలిన 24% ఎందుకు చేయలేదు??

ఊరుకోవయ్యా రాత్రనక, పగలనక కిందా మీదా పడి రెక్కలు ముక్కలు చేసుకుని మేము సంపాదించిన సొమ్ము గురించి ఎవడికో ఎందుకు చెప్పాలి ? టాక్స్ ఎందుకు కట్టాలి అంటారా??

కట్టకండి అస్సలు కట్టొద్దు , మనం ఇలా చేస్తున్నామనే ప్రభుత్వం అన్ని వస్తువుల మీద పన్ను వేసుకుంటూ పోతుంది !! వ్యక్తులకే తెలివి తేటలు ఉంటే మరీ ఆ వ్యక్తులు నిర్మించిన వ్యవస్థను నడుపుతున్న పాలకులకు ఇంకెంత తెలివి ఉంటది
ఒక చేత్తో ఓట్ల కోసం ప్రజలకు వరాల జల్లు కురిపిస్తూ మరో చేత్తో అంతకు పదింతలు వసూలు చేస్తున్నారు పరోక్షంగా

అదే విధంగా ప్రభుత్వం జనాలు సంపాదించిన సొమ్ము వివరాలు అడుగుతున్నాయి మరి ఖర్చుపెట్టిన సొమ్ము వివరాలను ఎందుకు అడగదు ? ఏమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

- Advertisment -
Google search engine

Recent Comments