పాల్వంచ నవబారత్ ప్లాంట్ లో 10 సంవత్సరా ల నుండి  గంగారబోయిన ఉపేందర్ s/o మల్లయ్య,వృత్తి మెకానికల్ గా పని చేసుకుంటూ తన యొక్క ఫ్యామిలీని పోసించు కుంటు జీవనం సాగిస్తున్నాడు  ఇటీవల కాలంలో 18-07-2020 నాడు నవభారత్ కర్మాగారంలో పనిచేస్తుండగా ప్రమాద వశాత్తు కన్వేయర్ బెల్టు డ్రమ్ లో చేయి తెగి పడినది సంఘటన జరిగిన రోజు సంబంధించిన కాంట్రాక్టర్ కిమ్స్ హాస్పిటల్ నందు ట్రీట్ మెంట్ చేపించారు హైదరాబాద్ లో ఆనాటి నుండి ఈనాటి వరకు బాధితుడికి నవభారత్ ప్లాంట్ యాజమాన్యం మేనేజ్ మెంట్ ఎటు వంటి న్యాయం చేయలేదని అందుకనే నిరాహార దీక్ష ద్వారా ఐన న్యాయం జరుగుతుందని భవిస్తూ బాధితుడు వాపోతున్నాడు భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ కమిటీ కి పిర్యాదు రూపంలో తెలియజేసారు. ఈ విషయంలో విచారణ జరిపి త్వరలో తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి బాడితుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఈసందర్భంగా తెలియజేసి బాధితుడి కి మనోధైర్యం కల్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పబ్లిసిటీ ఆఫీసర్ చింత రాములు. జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు