భద్రాద్రి కొత్తగూడెం / మణుగూరు

సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛత మహా కార్యక్రమంలో భాగంగా పి.కె ఓ క్ ప్రాంగణ ప్రాంతంలో స్వచ్ఛత మహా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి కె ఓ సి పి ఓ లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పై నిర్లక్ష్యం వహిస్తే వ్యక్తిగతంగా ఆరోగ్యం ఇబ్బందులపాలు అవుతుందని డ్యూటీలు, ఉద్యోగాన్ని కూడా సరిగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. మన కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలయితే మనసు శాంతి లేకుండా ఉంటుందని, ఆరోగ్యం లోనే ఆనందం ఉంటుంది అన్నారు. మన కుటుంబ సభ్యుల సింగరేణి సంస్థ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పరిసరాల పరిశుభ్రత తప్పక పాటించాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ తోటివారికి స్వచ్ఛత పై అవగాహన కల్పించి ఆచరించాలని ఆయన తెలిపారు. ఓ సి టు ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులకు కాంట్రాక్టు వర్కర్లకు శానిటైజర్లు, మాస్కులు, బ్లౌజులు పంపిణీ చేసినట్లు పర్సనల్ మేనేజర్ అజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ రాముడు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలిషా, పర్యావరణ అధికారి శ్రీనివాస్, టి బి జి కె ఎస్ నాయకులు కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు