భద్రాద్రి కొత్తగూడెం / బ్
భద్రాచలం పట్టణం లోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వద్ద పట్టణ సిఐ స్వామి ఆద్వర్యంలో ఎస్.ఐ బి మహేష్ తన సిబ్బందితో గురువారం మధ్యాహ్నం వాహన తనిఖీలు చేస్తుండగా టి ఎస్ 05 ఈ 8438 అనే నెంబర్ గల టాటా ఇండిగో ఈ సిఎస్ వాహనం ను ఆపి తనిఖీ చేయగా అందులో ప్రభుత్వ నిషేదిత గంజాయి ఉండటాన్ని గమనించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో కారు నందు 43 కేజీల గంజాయి లభ్యమైందని, దీని విలువ 6, 45, 000 వేల రూపాయలు గా ఉంటుందన్నారు. ఇందులో ఉన్న ముద్దాయిలను విచారించగా తమ పేర్లను ధరావత్ అరవింద్. చివ్వెంల మండలం నల్గొండ జిల్లా , మరియు ధరావత్ కవి చివ్వెంల మండలం నల్గొండ జిల్లా చెందిన వారని తెలిసిందన్నారు. భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుం టాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మారేయితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ టి. స్వామి , ఎస్. ఐ., బి మహేష్, మరియు సిబ్బంది పాల్గొన్నారు..