టీఆరెస్ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ పెద్దల అండలతో పోలీసులను అద్దం పెట్టుకుని చుట్టుపక్కల ఆదివాసీల పై పెత్తనం చేలాయిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నా కారణంగా వెంకటాపురం మండలం అలుబాక గ్రామానికి చెందిన నాయకుడు మదూరి భీమేశ్వర రావు అలియాస్ బీస్ ను నిన్న ములుగు లో మావోయిస్టులు హతమార్చారు .. బీజేపీ , టీఆరెస్ పార్టీలలో పనిచేస్తూ స్వప్రయోజనాల కోసం రాజకీయ ఆధిపత్యం చేసేవారందరికి బీస్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

సంఘటనా స్థలంలో మృతుడి శవం తో పాటు మావోయిస్టులు రాసిన లేఖ లభ్యమైంది ,హత్యకు వాడబడిన కత్తి రెండు బుల్లెట్ లు లభ్యమయ్యాయి పోలీసులు ఈ హత్యపై దర్యాప్తును మొదలెట్టారు 

 

లేఖ లో ఉన్న విషయం యధా తధం గా
ములుగు జిల్లా వెంకటాపురం (మాగూర్ ) మండలం ఆలుబాక గ్రామానికి చెందిన బేస్ టీఆరెఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ అధికార టీఆరెస్ పార్టీని పోలీస్ ల ప్రొద్బలాన్ని ఉపయోగించుకుని చుట్టుపక్కల గ్రామా ప్రజలపై పెత్తనం చేస్తూ ప్రజల మధ్య వైరుధ్యాలను సృష్టిస్తూ తన సొంత ప్రయోజనాలనునెరవేర్చుకుంటూ ప్రశించిన వారిని పోలీసులకు పట్టించడం లేదా బెదిరించడం చేస్తున్నాడు .

బూర్జువా పార్టీలో పనిచేస్తున్న కొద్దిమంది ఆదివాసీ నాయకులను తన అదుపు ఆజ్ఞలలో పెట్టుకుని పావులుగా వాడుకుంటున్నాడు ఎరువు మందులను ఎమ్మార్పీ ధరలకు కాకుండా తన ఇష్టానుసారం అమ్ముతున్నాడు , ప్రజలపై వడ్డీల ల మీద వడ్డీలు వేస్తూ పేదల రక్త తాగుతున్నాడు అదేమిటని అడిగిన వారిని పోలీసులతో కొట్టించడం చేస్తున్నాడు.
పోలీసులను ,అధికార పార్టీని అడ్డం పెట్టుకుని ప్రజలపై పెత్తనం చేయడం వారి మధ్య వైరుధ్యాలను సృష్టించి తమ పబ్బం గడుపుకోవడం, వడ్డీ వ్యాపారం కాంట్రాక్టులు చేస్తూ ఇష్టానుసారం వ్యవహరించినందుకు బీస్ ను ఖతం చేసాం .
బీజేపీ , టీఆరెస్ పార్టీలలో పనిచేస్తూ స్వప్రయోజనాల కోసం రాజకీయ ఆధిపత్యం చేసేవారందరికి బీస్ కు పట్టిన గతే పడుతుంది .

వెంకటాపురం వాజేడు పరిధిలోని బీజేపీ , టీఆరెస్ నాయకులూ తక్షణమే రాజీనామాలు చేయాలి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై కొనసాగిస్తున్న పాశవిక దాడులను వెంటనే నిలిపివేయాలని కోరుతున్నాం